23-12-2025 02:21:04 AM
కొలువు దీరిన కొత్త సర్పంచులు..
పండగ వాతావరణంలో ప్రమాణ స్వీకారోత్సవాలు...
తాండూరు, 22 డిసెంబర్, (విజయ క్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలోని పెద్దేముల్, యాలాల, బషీరాబాద్, తాండూర్ మండలాల గ్రామపంచాయతీలో నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్‌లు కొలువుదీరారు. మండల ప్రత్యేక అధికారులు కొత్త సర్పంచ్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. పెద్దముల్ మండలం కందనెల్లి తాండ నూతన గ్రామ సర్పంచ్ గా రాథోడ్ ఆనంద్ నాయక్ మరియు ఉప సర్పంచ్ సేవా నాయక్, వార్డు సభ్యుల చేత ప్రత్యేక అధికారి వినోద్ కుమార్, ప్రమాణ స్వీకారం చేయించారు.
కమ్యూనిటీ భవనాన్ని పచ్చటి తోరణాలతో అలంకరించి పండగ వాతావరణం లో ప్రమాణ స్వీకారం అనంతరం గ్రామస్తులకు మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు .ఈ సందర్భంగా సర్పంచ్ ఆనంద్ నాయక్ మాట్లాడుతూ గ్రామ పెద్దలు, యువకులు, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో అభివృద్ధి తో పాటు ప్రజలకు ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ పథకాలను ఇంటింటికి చేరేలా కృషి చేస్తానని అన్నారు. గ్రామ కార్యదర్శి నవిత మరియు గ్రామస్తులు యువకులు భారీగా పాల్గొన్నారు.