23-12-2025 02:20:45 AM
ముషీరాబాద్, డిసెంబర్ 22 (విజయక్రాంతి): పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల రూ.10వేల కోట్ల ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రంలో ఇక యుద్ధమేనని ఆయన హెచ్చరించారు. ఫీజుల బడ్జెట్ విడుదల చేయాల ని, వివిధ కాలేజీల్లో కోర్సులు చదువుతున్న 15 లక్షల మంది విద్యార్థుల రూ.10 వేల కోట్ల ఫీజుల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు పగిళ్ల సతీష్ కుమార్, బీసీ సంక్షేమ సంఘం కార్యనిర్వహణ అధ్యక్షుడు నీల వెంకటేష్ ముదిరాజ్‌ల ఆధ్వర్యం లో సోమవారం వేలాది మంది బీసీ విద్యార్థులు బర్కత్‌పుర నుంచి నారాయణగూడ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ప్రత్యేక ప్రాధాన్యతను ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచే స్తుందన్నారు. ఇంకొకవైపు విద్యార్థులు చదువుకోకుండా అనేక ఆటంకాలు సృష్టించాలని ప్రయత్నిస్తుందని విమర్శించారు. ఈ ఫీజుల బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు అష్ట కష్టాల పాలవుతున్నారన్నారు. ఈ పీజు లు కట్టాలని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నారని, కోర్సు పూర్తయి న ఫీజులు లేక సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని సర్టిఫికెట్లు లేక ఉద్యోగాలు వచ్చినవారికి అ ప్పులు చేసి ఫీజులు కట్టి సర్టిఫికెట్లు తీసుకుంటున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలోని 8వేల కాలేజీలలో 15 లక్షల మంది విద్యార్ధులు కష్టాలు పడతున్నారన్నారు. బడ్జెట్ లేకపోతే మూసి సుందరికరణకు లక్షా 50 వేల కోట్లు కేటాయిస్తామని సీఎం ప్రకటించారని వీటికి బడ్జెటులో ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఫీజులు బడ్జెట్ ఇవ్వకపోతే రాష్ట్రంలో యు ద్ధమే జరుగుతుందని హెచ్చరించారు. ఈ ప్రదర్శనలో శివ కుమార్ యాదవ్, నరేష్ గౌడ్, జిల్లపల్లి అంజి, అల్లంపల్లి రామకోటి, అనంతుల రామూర్తి గౌడ్, రాందేవ్ మోడీ, నిఖిల్ పటేల్, స్నేహ, మంజుల, మమత, మాధవి, అంజలి, అద్విత, సుమలత తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.