14-01-2026 01:58:17 AM
ఇకపై ‘పాక్’ కవ్విస్తే భస్మమే..
కోలుకోలేని విధంగా బుద్ధి చెప్తాం
భారత్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది
న్యూఢిల్లీ, జనవరి 13: ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోందని, భవిష్యత్తులో పాకిస్థాన్ ఏదైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే గట్టిగా బుద్ధి చెబుతామని భారత్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో సైన్యం తన సిబ్బందిని సమీకరించిందని.. పాకిస్థాన్ ఏదైనా ఉల్లంఘనకు పాల్పడితే భూ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ‘మేము పెద్ద సమీకరణ చేసాం.. పాకిస్థాన్ ఏదైనా తప్పు చేస్తే భూ దాడులకు మేము పూర్తిగా సిద్దంగా ఉన్నాం’ అని భారత ఆర్మీ చీఫ్ పేర్కొన్నారు.
ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌కు భార త సైన్యం గట్టి బుద్ధి చెప్పిందని, దెబ్బకు దెబ్బ తీసిందన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కీలక వి షయాలు వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని, భారత్‌లో త్రివిధ దళాల సమన్వయానికి ఇది నిదర్శనమన్నారు. దేశంలో భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్ సైనిక సంసిద్ధంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్ ద్వారా స్పష్టమైందని ఆర్మీ జనరల్ చీఫ్ పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్‌ను అత్యంత కచ్చిత్వంతో అమలు చేశామని, ౮౮ గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్‌లో మన సైనిక దళాలు అత్యంత సమర్థంగా పనిచేశాయన్నారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్ర వాద శిబిరాలను నేలమట్టం చేశామని ఆయ న తెలిపారు.
దాదాపు 100 మంది ఉగ్రవాదులు చనిపోయారని అన్నారు. పహల్గాం దాడిలో పర్యాటకులు ప్రాణాలు కోల్పోయా రు. ఆ రక్తపాతానికి ప్రతీకారమే ఆపరేషన్ సింధూర్. మే నెలలో మన సైన్యం విరుచుకుపడింది. ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. కేవలం 22 నిమిషాల్లో పని పూర్తి చేసిందని అన్నారు. ఆ మెరుపు దాడికి శత్రు వు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లాడు. ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంలో ప డ్డాడు. ఆపరేషన్ సమయంలో మన వ్యూ హం అద్భుతంగా సాగింది. సముద్రంలో నౌకాదళం కదిలింది. గగనతలంలో యుద్ధ విమానాలు గర్జించాయి.
సరిహద్దుల్లో స్ట్రైక్ కోర్ సిద్దమైంది. ఈ దృశ్యాలను పాక్ శాటిలైట్ల ద్వారా చూసింది. భారత్ యుద్ధానికి సిద్ధమైందని గ్రహించింది. మరుసటి క్షణం భారత్ ఏం చేయబోతుందో ఊహించింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని శాంతి కోసం ప్రాధేయపడింది.భారత ఆర్మీ చీఫ్ ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మే 10న మూడు దళాలకు సంకేతాలు వెళ్లాయి. యుద్ధం ముదిరితే ఎలా ఉండాలో తేల్చి చెప్పారు. ఆ హెచ్చరిక శత్రువుకు నేరుగా చేరింది. భయంతో పాక్ సైన్యం వెనక్కి తగ్గింది. వెంటనే కాల్పుల విరమణ కోరుతూ వేడుకుంది. మన లక్ష్యం నెరవేరింది. ఉగ్రవాదులకు తగిన శాస్తి జరిగింది. భారత్ ఎప్పు డూ తగ్గదని మరోసారి రుజువైంది.పాకిస్థాన్ ఏ చిన్న పొరపాటు చేసినా భూతల దాడులను ప్రారంభించేందుకు కూడా అప్పుడు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.
ఎనిమిది ఉగ్రవాద శిబిరాలు ఇప్పటికీ చురుకుగా ఉన్నాయి.. వీటిలో రెండు అంతర్జాతీయ సరిహద్దుకు ఎదురుగా, ఆరు నియంత్రణ రేఖ వెంబడి ఉన్నాయి. ఎలాం టి కదలికలు కానీ శిక్షణా కార్యకలాపాలు కానీ ఉన్నట్టు గుర్తించినట్లయితే అవసరమైన చర్య తీసుకుంటాం’ అని ద్వివేది హెచ్చరించారు.ఈశాన్య సరిహద్దులో పరిస్థితులపై కూడా ఆర్మీ చీఫ్ స్పందిస్తూ ఈశాన్య సరిహద్దులు స్థిరంగానే ఉన్నాయన్నారు. మణిపూర్‌లో పరిస్థితులు మెరుగపడ్డాయని, అయితే అప్రమత్తంగా ఉండటం కీలకమన్నారు. చైనా సరిహద్దుల్లోని భద్రత గురించి ఆర్మీ చీఫ్ మాట్లాడుతూ భారత బలగాలు చాలా శక్తివంతంగానే ఉన్నాయని, భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నారు. జమ్ము కశ్మీర్ పరిస్థితులు సున్నితంగా ఉన్నప్పటికీ, నియంత్రణలో ఉన్నాయన్నారు.