calender_icon.png 14 January, 2026 | 5:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీబీఐ ముందుకు మరోసారి విజయ్

14-01-2026 01:54:57 AM

19న విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ

న్యూఢిల్లీ, జనవరి ౧౩: టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ మరోసారి సీబీఐ ఎదుట హాజరుకానున్నారు. సోమవారం ఇప్పటికే ఒకసారి సీబీఐ ఎదుట హాజరైన విజయ్‌కి ఈ నెల ౧౯న హాజరుకావాలని మరోసారి సమన్లు జారీ అయ్యాయి. తొలిసారి విచారణ అసంపూర్తిగా నిలిచిపోవడంతోనే సీబీఐ మరోసారి ఆయన్ను విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. అయితే.. అంతకముందే హాజరు కావాలని విజయ్‌కి సూచించగా, ఆయన సంక్రాంతి నేపథ్యంలో కాస్త గడువు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. విజయ్ అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని సీబీఐ కొత్త తేదీ జారీ చేసినట్లు తెలియవచ్చింది.