01-02-2026 01:17:52 AM
రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే ఇటీవల ‘ఆంధ్రాకింగ్ తాలూక’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మహేశ్‌బాబు పీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పర్వాలేద నిపించింది. ఓ అభిమాని బయోపిక్ మాదిరిగా వచ్చిన చిత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం వసూళ్లు రాబట్టలేకపోయింది. అయితే, ఈ చిత్రంలో నాయకా నాయికలుగా రామ్, భాగ్యశ్రీ చేసిన సం దడిని ప్రేక్షకులు ఆస్వాదించారు.
ఇద్దరూ కలిసి నటించిన తొలి చిత్రం ఆశించిన స్థాయిలో విజయం దక్కకపోతేనేం.. మరోసారి ట్రై చేద్దామనుకున్నారో ఏమో ఈ జంట మళ్లీ కలిసి వస్తున్నారట! తాజాగా రామ్ కొత్త సినిమా ఖరారు అయినట్టు వార్తలు వినవస్తున్నాయి. ఇందులో రామ్ సరసన తన రూమర్ గర్ల్‌ఫ్రెండ్ భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించబోతోందని సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రాబోతోందని భోగట్టా. ఈ కొత్త ప్రాజెక్టు సరికొత్త జోనర్‌లో విభిన్నమైన కథతో రానుందట. ఆర్కా మీడియా నిర్మించనున్న ఈ చిత్రానికి కాస్త ఎక్కువ బడ్జెట్‌నే కేటాయించను న్నారని టాక్.