calender_icon.png 19 November, 2025 | 4:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్ స్టేట్ షోటొకాన్ కరాటే చాంపియన్ షిప్ 2025 పోటీల్లో ఆర్కిడ్స్ విద్యార్థుల ప్రతిభ

19-11-2025 12:00:00 AM

కామారెడ్డి, నవంబర్ 18, (విజయక్రాంతి): నల్గొండ జిల్లా, నకిరేకల్ పట్టణంలో JKAI  అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతరాష్ట్ర షోటఖాన్ కరాటే ఛాంపియన్షిప్2025 పోటీలలో కామారెడ్డి ఆర్కిడ్స్ హై స్కూల్కు చెందిన ఏడుగురు విద్యార్థులు పాల్గొన్నారు. అద్భుతమైన ప్రతిభ కనబరిచిన ఈ విద్యార్థుల్లో అబిష్ , చరణీ గోల్ మెడల్స్ సాధించి పాఠశాల పేరును గర్వంగా నిలబెట్టారు.

అలాగే తమన్నా, జవేరియా సిల్వర్ మెడల్స్ సాధించగా వర్షిత,ఇశాంక్  సాంబశివ మెరిట్ బహుమతులను అందుకున్నారు. ఈ విజయం వెనుక పాఠశాలలో జరుగుతున్న సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమంలో బ్లాక్ సెకండ్ ౄAN ట్రైనర్  సుమాంజలి  పర్యవేక్షణలో విద్యార్థులు పొందిన శిక్షణ కీలక పాత్ర పోషించిందన్నారు. విద్యార్థుల ఈ అద్భుత ప్రతిభను అభినందిస్తూ పాఠశాల చైర్మన్, ప్రిన్సిపాల్ సిహెచ్. గోవర్ధన్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ భూలక్ష్మి  శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా చైర్మన్, ప్రిన్సిపాల్ గోవర్ధన్ రెడ్డి  మాట్లాడుతూ.. మా విద్యార్థులు చదువుతో పాటు కరాటే, యోగా, క్రీడలు తదితర రంగాల్లో అసాధారణ ప్రతిభను ప్రదర్శిస్తూ పాఠశాల కీర్తిని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో నిలబెడుతున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు విద్యార్థిని విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.