calender_icon.png 24 November, 2025 | 3:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవయవ దానం శ్రేయస్కరం

23-11-2025 12:00:00 AM

దేశంలో అవయవ దానం, మార్పిడి వ్యవస్థను మరింత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా మార్చేందుకు సుప్రీంకోర్టు  కేంద్ర ప్రభుత్వాన్ని ఏకరీతిగల జాతీయ అవయవ విధానం రూపొందించాలని ఆదేశించడం ప్రశంసనీయం. ఇప్పటికీ రాష్ట్రాల వారీగా వేర్వేరు నియమాలు కొనసాగుతుండడం వల్ల అవయవాల కేటాయింపులో అసమానతలు, పేదలపై అన్యాయం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి.

ఈ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఒకే విధమైన నిబంధనలు ఉండడం అత్యవసరం. ప్రత్యేకంగా అవయవ దాతల భద్రతపై కోర్టు చూపించిన శ్రద్ధ ప్రస్తావనీయమైనది. దాతలు ధనదాహం, ఒత్తిడి వంటి మార్గాల్లో దోపిడీకి గురికాకుండా స్పష్టమౌన మార్గదర్శకాలు రూపొందించడం అవసరం. అంతేకాదు, రాష్ట్ర స్థాయి అవయవ మార్పిడి సంస్థలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

 శ్రీనివాస్, కరీంనగర్