calender_icon.png 24 November, 2025 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ డీఏలు మంజూరు చేయాలి

23-11-2025 12:00:00 AM

కేంద్రం తన ఉద్యోగులకు పెన్షనర్లను ఏటా మార్చి, సెప్టెంబర్ మాసా ల్లో క్రమం తప్పకుండా డీఏలు ప్రకటిస్తోంది. తెలంగాణలో మాత్రం ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్లకు డీఏ ఎప్పుడు ఇవ్వాలనే అంశంపై రాష్ట్ర ప్రభు త్వం ఇప్పటివరకు ఒక నిర్దిష్టమైన విధానాన్ని ప్రకటించలేదు. 2023 జనవరి నుంచి చెల్లించాల్సిన ఒక విడత కరువు భత్యం 3.64 శాతాన్ని ఈ ఏడాది జూన్‌లో మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నం. 70 జారీ చేసింది.

ఇదే చివరిసారిగా మంజూరు చేసిన డీఏ. రాష్ట్ర ప్రభుత్వోద్యోగు లు, పెన్షనర్లకు 44.59 శాతం డీఏ చెల్లించాల్సిఉండగా, ప్రస్తుతం 30.03 శాతం మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తోంది. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం మూడు డీఏలు పెండింగ్‌లో పెట్టింది. తాము అధికారంలోకి రాగానే ఆ మూడు డీఏలను తక్షణం చెల్లిస్తామని, సకాలంలో డీఏను ప్రకటించి, బకాయిలు నేరుగా ఉద్యోగుస్థులకు చెల్లిస్తామని చెబుతూ ఎన్నికల సమయంలో తమ మేనిఫెస్టోలో కాంగ్రెస్ స్పష్టమైన హామీ ఇచ్చింది. కానీ ప్రస్తుతం అయిదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆవలంబించిన ఉద్యోగ వ్యతిరేక వైఖరికి విసిగిపోయినందునే ఉద్యోగ, ఉపాధ్యా య, పెన్షనర్లు కాంగ్రెస్ హామీని నమ్మి ఆ పార్టీకి ఓటు వేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోలేదు. డీఏ పెంపు ఉద్యోగులకు అదనపు సౌజన్యం కాదు. వారి చట్టబద్ధమైన హ క్కు. కేంద్రం డీఏ ప్రకటించిన నెలలోపూ కరువు భత్యం మంజూరు చేసే విధంగా ఒక విధానపరమైన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి.

                                                   ప్రతాప్ రెడ్డి, వరంగల్