calender_icon.png 11 September, 2025 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవయవ మార్పిడి చికిత్సలను ప్రోత్సహించాలి

11-09-2025 12:05:52 AM

  1. ఎంజీఎం, రిమ్స్‌లో శస్త్ర చికిత్సలు జరిగేలా చూడాలి 
  2. అధికారుల సమావేశంలో మంత్రి దామోదర 

హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి) : ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. నిమ్స్, గాంధీ, ఉస్మానియాతో పాటు ఆదిలాబాద్ రిమ్స్, వరంగల్ ఎంజీఎంలోనూ అవయవమార్పిడి సర్జరీలు జరిగేలా చూడాలని  అధికారులకు మంత్రి సూచించారు.

రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఆర్గాన్ రిట్రైవల్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. జీవన్‌దాన్ పనితీరు, ప్రభుత్వ దవాఖానాల్లో అవయవ మార్పిడి చికిత్సలను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి దామోదర రాజనరసింహ బుధవారం జూబ్లిహిల్స్‌లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో అధికారులతో  సమావేశం నిర్వహించి మాట్లా డారు.

సీనియర్ డాక్టర్లతో డెడికేటెడ్ టీమ్స్ ఏర్పాటు చేయాలని, ఒక్కో ఆర్గాన్‌కు ఒక్కో టీమ్ ఉండాలని హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తుకు సూచించారు. ఇటీవల కేంద్ర చట్టాన్ని అనువధించుకున్నందున అందుకు అనుగుణంగా కొత్త నిబంధనల రూపకల్పనపై సమావేశంలో చర్చించారు. ఈ చట్టం ప్రకారం సొంత కుటుంబ సభ్యులతో పా టు, గ్రాండ్ పేరెంట్స్ కూడా అవయవాలు దానం చేసేందుకు, స్వీకరించేందుకు అర్హులేనని ఈ నిబంధనను అమలు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

తోట యాక్ట్ ప్రకా రం ఆర్గాన్ స్వాపింగ్‌కు కూడా అవకాశం ఇవ్వాలని అధికారులకు మంత్రి సూచించారు. ఈ యాక్ట్ ప్రకారం ఇరువురు పేషెం ట్ల కుటుంబ సభ్యులు ఒకరికొకరు ఆర్గాన్స్ డొనేట్ చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. స్వాపింగ్ విషయంలో ఇతర రాష్ట్రాలు అవలంబిస్తున్న నిబంధనలను పరిశీలించాలని చెప్పారు.

అవయదానంపై అవగాహన కల్పించాలి 

అవయవదానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జీవన్‌దాన్ కోఆర్డినేటర్, డాక్టర్ భూషన్రాజుకు మంత్రి దామోదర రాజనరసింహ సూచించారు. దీనికోసం ప్రజా ప్రతినిధులు, ప్రముఖుల సహకారం తీసుకోవాలన్నారు. ఆర్గాన్ డోనర్ల కుటుంబ సభ్యులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. డోనర్ల దహన సంస్కారాలకు ఆర్థిక సాయం అందించడంతో పాటు, వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలన్నారు.