calender_icon.png 26 November, 2025 | 5:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

25-11-2025 12:00:00 AM

  1. ఇంచార్జి కలెక్టర్ గరిమ అగర్‌వాల్

కార్మిక శాఖ పోస్టర్ ఆవిష్కరణ

రాజన్న సిరిసిల్ల, నవంబర్ 24(విజయక్రాంతి): ప్రజావాణి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించగా, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించా రు.

ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ మాట్లాడారు. ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులను ఆయా శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, వెంటనే పరిష్కరించాలని సూచించారు.రెవెన్యూ శాఖకు 42, హౌసింగ్ 22, సీపీఓ, ఉపాధి కల్పన శాఖ అధికారికి 8 చొప్పున, డీఆర్డీఓ, ఎస్డీసీకి 7 చొప్పున, ఆర్డీఓ వేములవాడ, డీపీఓ, డీఈఓకు ఐదు చొప్పున, డీఏఓకు నాలుగు, నీటి పారుదల శాఖ, ఎక్సైజ్ శాఖ,

సెస్ కు మూడు చొప్పున, ఏవో కలెక్టరేట్, బీసీ సంక్షేమ అధికారి, ఈఈ పీఆర్, జిల్లా సంక్షేమ అధికారి, మున్సిపల్ కమిషనర్ సిరిసిల్ల కు రెండు చొప్పున, సర్వే అండ్ ల్యాండ్ రికారడ్స్, మత్స్య శాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ, డీపీఆర్‌ఓ, ఈడీఎం, ఈఈ ఆర్ అండ్ బీ, ఎంపీడీఓ వేములవాడ, ఎల్లారెడ్డిపేట, మున్సిపల్ కమిషనర్ వేములవాడ కు ఒకటి చొప్పున వ చ్చాయి.

భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులకు భీమా పెంపు పోస్టర్ ఆవిష్కరణ భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులకు ప్రభుత్వం ప్రమాద, సహజ బీమాను పెంచగా, దానికి సంబంధించిన పోస్టర్లను ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, కార్మిక శాఖ అ ధికారి నజీర్ అహ్మద్ తో కలిసి ఆవిష్కరించారు. కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంచార్జి కలెక్టర్ పిలుపు ఇచ్చారు. కార్యక్రమంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెం కటేశ్వర్లు, రాధాభాయ్, డీఆర్డీఓ శేషాద్రి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత తదితరులు పాల్గొన్నారు.