23-09-2025 12:16:19 AM
ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి
సుల్తానాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి):సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక గా నిలిచే తెలంగాణ బతుకమ్మ కు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు లభించిందని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి అన్నారు.
సుల్తానాబాద్ లోని ఆల్ఫోర్స్ పాఠశాలలో బతుకమ్మ వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించారు .ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ మహిళలకు ప్రత్యేకమైనదని అన్నారు. పేర్చిన బతుకమ్మలను మధ్యలో పెట్టి బతుకమ్మ ఆటను మహిళలు, పిల్లలు పాల్గొని సంతోషంగాగడిపారు.