16-09-2025 01:02:35 AM
అంకిత్ కొయ్య, నీలఖి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘బ్యూటీ’. జీ స్టూడియోస్, మారుతీ టీమ్ ప్రొడకట్స్, వానర సెల్యూలాయిడ్ పతాకాలపై విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఉమేశ్ కుమార్ భన్సల్ నిర్మించారు. ఈ సినిమాకు ‘గీతా సుబ్రమణ్యం’, ‘హలో వరల్డ్’, ‘భలే ఉన్నాడే’ ఫేమ్ జె.ఎస్.ఎస్. వర్ధన్ మాటలు, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహించారు. కథ, స్క్రీన్ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించారు. ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కాబోతోంది.
ఈ క్రమంలో దర్శకుడు వర్ధన్ విలేకరులతో చిత్ర విశేషాలను పంచుకున్నారు. ‘ఈ కథ మారుతి పిలిచి నాకు ఇచ్చారు. దీన్ని సుబ్రహ్మణ్యం అనే జర్నలిస్ట్ రాశారు. ఆయనే డైరెక్ట్ చేయాలి కానీ వేరే వాళ్లకు ఇమ్మనడంతో జీ వాళ్ళు నన్ను ప్రపోజ్ చేశారు నా వర్క్ నచ్చి. మొదటిసారి నేను వేరే వాళ్ళ కథకు పనిచేసాను. దాంతో నేను వారం రోజులు కథని అర్థం చేసుకున్నాను. దీంట్లో రిలేటిబులిటీ ఎక్కువ ఉంటుంది. హీరో, హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది నా ’గీతా సుబ్రహ్మణ్యం’ సినిమాలాగే.
ఈ సినిమాలో ఒక మంచి డ్రామా నడుస్తుంది. బోర్ కొట్టదు. ఇందులో అన్ని పాత్రలకు రిలేట్ అవుతాము. హీరోయిన్ ని చూస్తే పక్కింటి అమ్మాయి అనిపిస్తుంది. మొదట వేరే అమ్మాయి అనుకున్నాం. కానీ, ఆమె పక్కింటి అమ్మాయిలా లేదని మార్చేసాం హీరో అంకిత్ తప్ప ఈ సినిమాలో అందర్నీ నేనే సెలెక్ట్ చేసుకున్నాను. అంకిత్ రియాల్టీగా నటించాడు. సినిమాని తన భుజాల మీద మోస్తున్నాడు. ఒక లైన్ లో ఈ సినిమా కథ చెప్పాలంటే.. ఒక మధ్య తరగతి అమ్మాయి గురించి చెప్పాలనుకున్నాను.
ఈ సినిమాలో నాన్న క్యాబ్ డ్రైవర్ అయినా ఆయన స్థితికి మించి చేస్తున్నా కూతురికి తెలీదు. ఈ కథలో జీవితం చూపిస్తున్నాం. ఈ సినిమాలో లవ్ స్టోరీ మాత్రమే కాదు థ్రిల్లింగ్ కూడా ఉంటుంది. ఒక ఎమోషనల్ డ్రామా ఉంటుంది. ఒక కపుల్ ఏమి లేకుండా బయటకు వచ్చేస్తే వాళ్ళు ఎలాంటి కష్టాలు పడతారు అని చూపించాను. ఇటీవల సినిమాల నిడివి విషయంలో ఎక్కువ డిస్కషన్ చేస్తున్నారు. మారుతీ ఈ సినిమా చూసి ఒక 5 నిముషాలు కట్ చేస్తే బాగుండు అని అన్నారు.. ఏడు నిమిషాల వరకు కట్ చేశాను.
ఈ సినిమాలో హీరోయిన్ ఇన్నర్ బ్యూటీ కంటే ఔటర్ బ్యూటీ కి ఎక్కువ విలువ ఇస్తుంది. అది కాదు ఇన్నర్ బ్యూటీ ఇంపార్టెంట్ అని చెప్పడానికి బ్యూటీ అని టైటిల్ పెట్టాం. నాకు మట్టి వాసన కథలు చెప్పాలని ఉంది. ఒక మార్షల్ ఆరట్స్ కథ రాసుకున్నా. దాని గురించి ట్రైనింగ్ నేర్చుకున్నా. మనలోంచి కథలు రావాలి. అలాంటి కథలే రాస్తాను. జనాల్ని గమనించి రాసుకుంటాను. నాకు యాక్షన్ కూడా ఇష్టమే. సిరీస్ లు కూడా చేస్తాను. గీత సుబ్రహ్మణ్యం, పెళ్లిగోల సీక్వెల్స్ కి పిలిస్తే వెళ్తాను. అమెజాన్ తో ఒకటి డిస్కషన్స్ జరుగుతున్నాయి‘ అని తెలిపారు.