calender_icon.png 16 September, 2025 | 3:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్తగుందే పాత లోకమంతా..

16-09-2025 01:03:35 AM

ధనుష్ హీరో, డైరెక్టర్ గా రూపొందుతున్న చిత్రం ‘ఇడ్లీ కొట్టు’. నిత్యా మీనన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అరుణ్ విజయ్, షాలిని పాండే, సత్యరాజ్, రాజ్కిరణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డాన్ పిక్చర్స్, వండర్బార్ ఫిలమ్స్ బ్యానర్స్ పై ఆకాశ్ భాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ‘కొత్తగుందే’ సాంగ్ రిలీజ్ చేశారు. జివి ప్రకాశ్ కుమార్ ఈ సాంగ్ ని ఫీల్ గుడ్ మెలోడీ గా కంపోజ్ చేశారు.

సింగర్స్ కృష్ణ తేజస్వి, శ్వేతా మోహన్ వోకల్స్ సాంగ్ కి మరింత మెలోడీ వైబ్ ని తీసుకొచ్చాయి. సామ్రాట్ నాయుడు ఆకట్టుకునే లిరిక్స్ అందించారు. ‘కొత్తగుందే పాత లోకమంతా..’ అంటూ సాగే ఈ పాటలో ధనుష్, నిత్యా మీనన్ కెమిస్ట్రీ చాల బ్యూటీఫుల్ గా వుంది. శ్రీ వేదాక్షర మూవీస్ బ్యానర్ ద్వారా నిర్మాత రామారావు చింతపల్లి తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అక్టోబర్ 1న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి కిరణ్ కౌశిక్ డీవోపీ గా, ప్రసన్న జీకే ఎడిటర్ గా, జాకీ ప్రొడక్షన్ డిజైనర్ గా, పనిచేస్తున్నారు. పీటర్ హెయిన్ మాస్టర్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.