09-10-2025 12:00:00 AM
బిఆర్‌ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు
దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి
మూసాపేట, అక్టోబర్ 8: ప్రజా పాలన ప్రభుత్వం ప్రతి ఒక్కరికి భరోసానిస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ను దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, తుంకిణి పూర్ మాజీ సర్పంచ్ బుచ్చన్న గౌడ్, పలువురు బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు మరియు దాసర్ పల్లి గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు జి. సత్యనారాయణతో పాటు పలువురు కార్యకర్తలు,నిజలాపూర్ గ్రామానికి చెందిన బిఆర్‌ఎస్ నాయకులు, ముదిరాజ్ సంఘం గ్రామ అధ్యక్షులు సి. బాబు , జి. దయాకర్, గాజుబండ వెంకటేష్, మోత్కరి భీమేష్, సి. చిన్న కురుమన్న సిరిపురం చందు, సి.రాములు, సి. తిమన్న పలువురు బిఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ కండువా కప్పి ఎమ్మెల్యే ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐక్యమత్యంగా ఉంటూ అభివృద్ధి వైపు ముందుకు సాగుదాం అని సూచించారు. ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటారని ఎవరికి ఏ ఆమోదం వచ్చిన తక్షణమే స్పందించి పరిష్కరించుకుందామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.