calender_icon.png 12 August, 2025 | 5:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా జిల్లా మాజీ మంత్రి.. ఆమ్దానీలో టాప్!

12-08-2025 01:31:46 AM

  1. అక్రమార్జనలో మాజీ సీఎం కేసీఆర్‌నే మించిండు 
  2. ఆయనకు షాబాద్‌లో 80 ఎకరాల ఫాంహౌస్
  3. కేసీఆర్ ఫాంహౌస్‌లో ఎకరం 50 లక్షలే.. సదరు నేత ఫాంహౌస్‌లో ఎకరం 40 కోట్లు 
  4. ఎస్‌ఎల్‌బీసీ కూలాలని కేసీఆర్ క్షుద్రపూజలు 
  5. బంగారు తెలంగాణ అంటూ బిచ్చగాళ్ల రాష్ట్రంగా మార్చారు 
  6. చిట్‌చాట్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపణలు

హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): ‘మా జిల్లాకు చెందిన మాజీమంత్రి అక్రమార్జనలో మాజీ సీఎం కేసీఆర్‌ను మించిండు. కేసీఆర్ ఫాం హౌస్‌లో ఎకరం 50 లక్ష లు ఉంటే.. మా జిల్లా నేత ఫాంహౌస్‌లో మాత్రం ఎకరం 40 కోట్లు ఉంది’ అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని ఉద్దేశిస్తూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.

బీఆర్‌ఎస్ అగ్రనేతల బినామీలు ఫోన్లు ఎత్తడం లేదని, ఆ పార్టీలో వాళ్లకువాళ్లే కొట్టుకుంటున్నారని పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో మంత్రి కోమటి రెడ్డి మీడియాతో చిట్‌చాట్ నిర్వహించా రు. ‘ఎస్‌ఎల్‌బీసీ కోసం వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో నేను కొట్లాడిన. కేసీఆర్ కుటుంబం ఏం క్షుద్రపూజలు చేసిందో ఎస్‌ఎల్‌బీసీ కూలింది. ఇప్పుడిప్పుడే రా ష్ర్ట ఆర్థిక పరిస్థితి కుదుటపడుతోంది. సెక్రటేరియట్ క ట్టి రూ.350 కోట్ల బకాయి లు మామీద పెట్టారు.

32 జిల్లాల్లో కలెక్టర్ ఆఫీసులు కట్టామని బీఆర్‌ఎస్ గొప్ప లు చెబుతుంది. వాటి తాలుకు అప్పులను ఇప్పుడు మేం క్లియర్ చేస్తున్నాం. బంగారు తెలంగాణ అంటూ రాష్ట్రాన్ని బిచ్చగాళ్ల రాష్ర్టం చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో రాష్ర్టం పూర్తిగా దివాళా తీసింది’ అని ఆరోపించారు. హైదరాబాద్‌కు రీజినల్ రింగ్ రోడ్డుతో సినిమా షూ టింగ్స్ హబ్‌గా మారుతుందని.. ట్రిపుల్ ఆర్ భూసేకరణకు రూ.6 వేల కోట్లు ఖర్చు అవుతుందని మంత్రి చెప్పారు.

కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన ఇంజినీర్ల వద్ద రూ.50 వేల కోట్ల నుంచి రూ.60 వేల కోట్లు ఉన్నాయని. అధికారుల వద్దే అంత డబ్బు ఉంటే లీడర్ల వద్ద ఎంత ఉంటాయో ఊహించలేమన్నారు. పైసలతోనే మళ్లీ అధికారంలోకి రావాలని కేసీఆర్ శథవిధాల ప్రయత్నించారని చెప్పొకొచ్చారు. ‘అభివృద్ధిలో హైదరాబాద్ తర్వాత నల్లగొండ ఉంటుందని, హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్ ముందు ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లాంటిదే నల్లగొండలో నిర్మిస్తున్నామని’ చెప్పారు.

‘ఉప్పల్ నుంచి నారపల్లి వరకు ఉన్న 8 కిలోమీటర్ల రోడ్డు 2017 నుంచి ఇప్పటివరకు పూర్తికాలేదు. హైదరాబాద్‌ను విశ్వనగరం చేశామని కేటీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పూర్తి సహకారం అందిస్తున్నారు. ఏ పార్టీ వారైనా అపాయింట్‌మెంట్ అడగ్గానే ఇస్తున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డికి ఢిల్లీ ఎక్కడ ఉందో కూడా తెలియదు’ అని విమర్శించారు. 

కక్ష సాధింపులకు పాల్పడటం లేదు.. 

‘నేను ఏడుసార్లు ఎన్నికల్లో పోటీచేసి ఆరుసార్లు గెలిచా. నా అఫిడవిట్‌లో ఎలాంటి తప్పులు లేవు. ఏపీలో రాజకీయం వేరు.. తెలంగాణలో రాజకీయం వేరు. ఏపీని చూసి తెలంగాణలో అరెస్టులు ఉంటాయని అనుకోవద్దు. జస్టిస్ పీసీ ఘోష్ మొదటి లోక్‌పాల్‌గా పనిచేశారు. మాపై ఇతర దేశాల నుంచి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తున్నారు.

రూ.3 లక్షల జీతం ఉన్న అధికారి థాయ్‌లాండ్‌లో పెళ్లి చేశారంటే ఎంత బహిరంగంగా అవినీతి జరిగిందో అర్థమవుతంది. విలన్‌లది (ప్రతినాయకులు) కొన్ని రోజులు మాత్రమే నడుస్తుంది. మా సీఎం, మేం ఎవర్ గ్రీన్ హీరోలం. మేం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడటంలేదు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చిస్తాం. 

అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుంటాం. కాళేశ్వరం కేసీఆర్‌కు ఏటీఎంగా మారిందని బీజేపీ నేతలు చాలాసార్లు వ్యాఖ్యానించారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుంది’ అని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు.