10-12-2025 01:23:19 AM
కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం
వెంకటాపూర్(రామప్ప), డిసెంబర్09, (విజయక్రాంతి):మండల కేంద్రంలోని గ్రా మపంచాయతీ సర్పంచ్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మామిడిశెట్టి సుగుణ స్వామి బరిలో దిగారు. ఇటీవల నామినేషన్ దాఖ లు చేసిన ఆయన, గ్రామ అభివృద్ధిని ప్రధా న లక్ష్యంగా పెట్టుకుని విస్తృతంగా ప్రజల మధ్య ప్రచారం నిర్వహిస్తున్నారు. సుగుణ స్వామి ఇంటింటికి తిరుగుతూ గ్రామ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇస్తున్నారు.
గ్రామంలో శుద్ధి తాగునీరు, రోడ్లు, పారిశుద్ధ్యం, వీధిదీపాలు, యువతకు ఉపాధి అవకాశాలు వంటి అంశాలను తన ప్రధాన ఎజెండాగా సూచించారు. ప్రచారం లో కాంగ్రెస్ కార్యకర్తలు, స్థానిక నాయకులు పాల్గొంటూ జనసామాన్యాన్ని సంప్రదిస్తున్నారు.
ప్రజలు తమ సమస్యలను, అభిలా షలను ఆయనకు వివరించగా, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని సుగుణ స్వా మి భరోసా ఇచ్చారు. గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజలు తనకు ఆశీర్వాదం అందించాలని, తమ ఓటు విలువైనదని, మంచి పరిపాలన కోసం వినియోగించాలని ఆయన కోరుతున్నారు.