10-12-2025 01:23:12 AM
హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి) : తెలంగాణ ఒక యువ, చైతన్యవం తమైన రాష్ర్టంగా సమ్మిళిత అభివృద్ధిని ఎల్లప్పుడూ ప్రధాన లక్ష్యంగా తీసుకుని ముందు కు సాగుతోందని ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల, సీనియర్ సిటిజెన్స్, ట్రాన్స్‌జెండర్ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ‘సమ్మిళిత సంపద - ప్రతి ఒక్కరికీ అవకాశాల విస్తరణ’ అనే థీమ్‌తో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 లో ప్రత్యేక సెషన్‌లో పాల్గొని మాట్లాడారు.
అభివృద్ధిని కేవలం ఆర్థిక వృద్ధితోనే కొలవడం సరిపోదని, సామాజికంగా, ఆర్థికంగా అన్ని వర్గాలు నిర్దేశించుకున్న ప్రధాన లక్ష్యా లు ఎంతవరకు చేరుకున్నాయనేది నిజమైన ప్రగతికి కొలమానమని చెప్పారు. ఈ నేపథ్యంతోనే విజన్-2047 రూపకల్పనకు ప్రేరణ లభించిందని మంత్రి వివరించారు. ప్రతి పౌరుడికి విద్య, నైపుణ్యాలు, గౌరవం మరియు స్థిరమైన జీవనోపాధి లభించేలా తెలంగాణ భవిష్యత్తును నిర్మించడమే ఈ విజన్ లక్ష్యం అని అన్నారు.
పథకాలను అందించడం...లేదా పంపిణీ నుంచి ఆ కుటుం బం కేంద్రిత అభివృద్ధి వైపు ప్రభుత్వ విధానాలు మారుతున్నాయని, రాష్ర్టంలోని హాస్ట ళ్లను ప్రతిభ కేంద్రాలుగా మార్చి విద్యను నైపుణ్యాభివృద్ధితో అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. దివ్యాంగుల సాధికారత కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు..
ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు సమాన అవకాశాలు కల్పించేందుకు రూపొందించిన ప్రత్యే క కార్యక్రమాలు, భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థకు అవసరమైన నైపుణ్యాలపై దృష్టి సారించడం, సామాజిక న్యాయం-గౌరవం- భద్రతపై సీఎం రేవంత్ రెడ్డి ఒక స్పష్టమైన వైఖరితో ముందుకెళ్తున్నారని చెప్పారు. డిజిటల్ గవర్నెన్స్, పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలన తెలంగాణ కొత్త దశకు పునాది వేస్తున్నాయని తెలిపారు. బాలికల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టడం, ఆరోగ్యం-విద్య-రక్షణ రంగాలలో కొత్త విధానా లు రూపొందించడం ద్వారా రాష్ర్టం మరిం త ప్రగతిపథంలోకి వెళ్తోందని చెప్పారు.