calender_icon.png 30 August, 2025 | 7:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెస్ అధికారుల తీరుపై ఆగ్రహం

30-08-2025 12:12:40 AM

రాజన్న సిరిసిల్ల: ఆగస్టు 29 (విజయక్రాంతి) సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ సెస్ వ్యవహరిస్తున్న తీరుపై శుక్రవారం సిరిసిల్ల పాలిస్టర్ అసోసియేషన్, ఎస్. ఎస్ .ఐ యూనిట్ల నిర్వాహకులు బ్యాక్ బిల్లింగ్ విషయంలో సెస్ అధికారులు అనుసరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు.బ్యాక్ బిల్లింగ్ బకాయిల విషయంలో సెస్ నుంచి వేధింపులు ఆపాలని నినాదాలు చేస్తూ సెస్ కార్యాలయం గేటు ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. సెస్ అధికారులు అనుసరిస్తున్న తీరుపై. నిరసనలో కార్యక్రమం లొ పాలిస్టర్ అసోసియేషన్ నాయకులు ఎస్ ఎస్ ఐ యూనిట్ల నిర్వాహకులు పాల్గొన్నారు. 

ఆందోళన సరికాదు: చిక్కాల రామారావు, సెస్ చైర్మన్

సెస్ కార్యాలయ ముట్టడిపై చైర్మన్ చిక్కాల రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు జరిగిన నష్టాలు అంచనా వేసేందుకు తంగళ్ళపల్లి మండలంలో విద్యుత్ లైన్లు పరిశీలించేందుకు వెళుతున్న క్రమంలో ఇక్కడ యజమానులు ఆందోళన చేపట్టారని తెలిపారు. సెస్ నుండి ఇప్పటివరకు ఎలాంటి వేధింపులు జరపలేదని అన్నారు. బ్యాక్ బిల్లింగ్ విషయంలో సిరిసిల్ల నేతన్నలకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ తామే ప్రభుత్వానికి , విద్యుత్ నియంత్రణ మండలికి లేఖ రాశామని అన్నారు.

పెరిగిన బిల్లులు కాకుండా కాల్చుకున్న కరెంటుకు యూనిట్ కు రెండు రూపాయల చొప్పున చెల్లించాలని కోరిన స్పందించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికి సేస్ సంస్థకు బకాయి పడిన తగ్గింపు చేసిన బిల్లులే 73 లక్షలు ఉన్నాయని తక్షణం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సెస్ డైరెక్టర్లు లక్ష్మీనారాయణ, నారాయణరావు పాల్గొన్నారు.