calender_icon.png 30 August, 2025 | 4:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విశ్వబ్రాహ్మణులు అన్ని రంగాల్లో ముందుండాలి

30-08-2025 12:13:48 AM

ఉత్తర ప్రదేశ్ మాజీ విద్యాశాఖ మంత్రి రామ్ ఆశ్రే, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి

ముషీరాబాద్, ఆగస్టు 29(విజయక్రాంతి): విశ్వబ్రాహ్మణులు అన్ని రంగాలలో ముందుండాలని శాసనమండలి ప్రతిపక్షనేత సిరికొండ, ఎమ్మెల్సీ  మధుసూదనా చారి అన్నారు. విశ్వబ్రాహ్మణ సమాజం అభివృద్ధి కోసం గత పదేళ్లుగా దేశ వ్యాప్తంగా విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ కృషి చేస్తోందని, గ్రామ గ్రామాన విశ్వబ్రాహ్మణుల్ని చైతన్యం చేసేందుకు విశ్వనాథుల పుష్పగిరి అహర్నిశలు కృషి చేయడం అభినందనీయం అన్నా రు.

శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్   లో విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ ఫౌండర్ చీఫ్ విశ్వనాథుల పుష్పగిరి ఆధ్వర్యంలో విశ్వకర్మల రాజకీయ ఆర్థిక సాంస్కృతిక సామాజిక చైతన్యం కోసం సెప్టెంబర్ 17 నుండి నవంబర్ 20 వరకు ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వరకు చేపడుతున్న 1500 కిలోమీటర్ల పాదయాత్ర పోస్టర్ ను ఉత్తర ప్రదేశ్ మాజీ విద్యాశాఖా మంత్రి రామ్ ఆశ్రే విశ్వకర్మ, తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, రఘువీర్ ప్రతాప్, సుదర్శనాచారి, గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రామాచారి, కూరెళ్ళ శివరామ్ ఆచారి, ప్రవీణ్ కుమార్, త్రినాథ్ చారి, పట్నాల సావిత్రి, ఆర్.వి.లక్ష్మీ తదితరులతో కలసి ఆవిష్కరించి మాట్లాడారు.

ఇటీవల టాంక్ బండ్ నుండి శ్రీశైలం వరకు బైక్ యాత్ర, ఎల్.బి.నగర్ నుండి కడప జిల్లా శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి మఠం వరకు 500 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారని, రెండవ విడతలో బాగంగా 1500 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టనున్న పుష్పగిరికి విశ్వబ్రాహ్మణులు వెంట నిలవాలని కోరారు.

ఉత్తరప్రదేశ్ మాజీ విద్యాశాఖా మంత్రి రామ్ ఆశ్రే మాట్లాడుతూ  విశ్వబ్రాహ్మణులు ఐక్యంగా ఉండి తమ హక్కుల సాధన కోసం కృషి చేయాలన్నారు. యువత పెద్ద ఎత్తున నాయకత్వంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం మధుసూదనాచారి రామ్ ఆశ్రేను ఘనంగా సన్మానించారు. బసవోజు దేవేంద్రాచారి, విశ్వనాథ్ ఆచారి, వడ్ల సుమంత్ ఆచారి, రాజశేఖర్, బండారు విజయ్ చారి తదితరులు పాల్గొన్నారు.