calender_icon.png 8 November, 2025 | 2:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్

08-11-2025 12:03:43 AM

శుభాకాంక్షలు తెలిపి అభినందించిన సీఎం

కరీంనగర్, నవంబరు 7 (విజయ క్రాంతి): ఇటీవల కరీంనగర్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ గా ఎన్నికైన కర్ర రాజశేఖర్ శుక్రవా రం జిల్లాకు చెందిన రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిరిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కర్ర రాజశేఖర్ కు శుభాకాంక్షలు తెలిపి అభినందించగా, కర్ర రాజశేఖర్ బ్యాంకు అభివృద్ధి కార్యాచరణ తదితర అంశాలపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. వినియోగదారులకు, ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలని, వారి విశ్వాసం మేరకు పని చేయాలని, బ్యాంకు అభివృద్ధికి ప్రభుత్వం పక్షాన పూర్తిగా సహకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని రాజశేఖర్‌తెలిపారు.