calender_icon.png 13 May, 2025 | 5:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాక్.. ఊసరవెల్లి

13-05-2025 01:16:47 AM

  1. దాని మాటలు నమ్మొద్దు

భారత్‌కు బలూచ్ లిబరేషన్ ఆర్మీ సూచన

న్యూఢిల్లీ, మే 12: ‘పాకిస్థాన్ నుం చి వినిపించే శాంతి, సోదరభావం ప్రవచనాలు కేవలం మోసం. అవి యుద్ధవ్యూహంలో భాగం..  ఇప్పటి పరిస్థితుల నుంచి తప్పించుకునేందు కు తాత్కాలిక ఉ పాయం మాత్రమే’ అని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ పేర్కొంది. ఆపరేషన్ సిందూర్ తర్వా త సైనిక ఘర్షణను ఆపేందుకు భారత్ మధ్య కాల్పుల విరమణ ఒ ప్పందం కుదిరిన సంగతి తెలిసిందే.

పాకిస్థాన్‌లోని వేర్పాటువాద సంస్థ బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఈ మేరకు స్పందించింది. ఆ దేశంతో అప్రమత్తంగా ఉండాలని పరోక్షంగా భారత్ కు సూచించింది. ఫారిన్ ప్రాక్సీ అంటూ వస్తోన్న విమర్శలను బలూ చ్ ఆర్మీ కొట్టిపారేసింది. ‘మేం కీలుబొమ్మలం కాదు. ఈ ప్రాంతానికి  సైనిక, రాజకీయ, వ్యూహాత్మక నిర్మాణంలో మాకు సరైన స్థానం ఉంది. మా పాత్ర గురించి మా కు పూ ర్తిగా తెలుసు’ అని వెల్లడించింది. తనను తాను డైనమిక్, నిర్ణయాత్మక పార్టీగా అభివర్ణించుకుంది.