calender_icon.png 5 July, 2025 | 10:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాకిస్థాన్‌దే టీ20 సిరీస్‌జింబాబ్వేతో రెండో టీ20

04-12-2024 12:38:15 AM

బులవాయో: జింబాబ్వేతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను పాకిస్థాన్ ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2 కైవసం చేసుకుంది. మంగళవారం బులవాయో వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే పాక్ బౌలర్ల ధాటికి 12.4 ఓవర్లలో 57 పరుగులకే కుప్పకూలింది. బ్రియాన్ బెన్నెట్ (21), మరుమాని (16) మినహా మిగతా వారందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.

పాక్ బౌలర్లలో సుఫియన్ మక్వీమ్ (5/3) కెరీర్ బెస్ట్ గణాంకాలు నమోదు చేయగా.. అబ్బాస్ అఫ్రిది 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం స్వల్ప ఛేదనలో పాక్ ఒక్క వికెట్ కోల్పోకుండానే 5.3 ఓవర్లలో 61 పరుగులు చేసి గెలుపొందింది. సయీబ్ అయూబ్ (36 నాటౌట్), ఒమెర్ యూసఫ్ (22 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇరుజట్ల మధ్య మూడో టీ20 గురువారం జరగనుంది.

57టీ20ల్లో జింబాబ్వేకు ఇదే అత్యల్ప స్కోరు. గతంలో శ్రీలంకతో మ్యాచ్‌లో 81 పరుగులకు ఆలౌటైంది.