calender_icon.png 5 July, 2025 | 5:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యు ముంబా విజయం

04-12-2024 12:42:29 AM

పీకేఎల్ 11వ సీజన్

పూణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్‌లో యు ముంబా 9వ విజయాన్ని సొంతం చేసుకుంది. మంగళవారం పూణే వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో యు ముంబా 43 పునేరి పల్టన్‌పై విజయాన్ని అందుకుంది. ముంబా తరఫున అజిత్ చౌహన్ 12 పాయింట్లతో సూపర్ టెన్ సాధించగా.. సునీల్ కుమార్, సోంబిర్ చెరో 5 పాయింట్లు అందించారు. పల్టన్స్ తరఫున పంకజ్ మొహితె 9 పాయింట్లతో టాప్ ప్రదర్శన కనబరిచాడు. ఈ విజయంతో యు ముంబా పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది.

బెంగళూరు బుల్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగిన మరో మ్యాచ్ 34 డ్రాగా ముగిసింది. బెంగళూరు ఆల్‌రౌండర్ నితిన్ రావల్ 7 పాయింట్లతో మెరవగా.. కెప్టెన్ పర్దీప్ నర్వాల్ 6 పాయింట్లు సాధించాడు. గుజరాత్ తరఫున నీరజ్ కుమార్ 5 పాయింట్లు సాధించాడు. తొలి నుంచి నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో ఆఖరి నిమిషంలో బెంగళూరు పోరాడినప్పటికీ డ్రా తప్పలేదు. నేటి మ్యాచ్‌ల్లో తెలుగు టైటాన్స్‌తో యూపీ యోధాస్, హర్యానాతో బెంగాల్ తలపడనున్నాయి.