calender_icon.png 22 January, 2026 | 10:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆసీస్ చేతిలో పాక్ వైట్‌వాష్

19-11-2024 12:00:00 AM

కంగారూలదే టీ20 సిరీస్

హోబర్ట్: వన్డే సిరీస్ గెలిచి కంగారూలకు షాక్ ఇచ్చిన పాకిస్థాన్ టీ20 సిరీస్‌లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో (3-0తో) వైట్‌వాష్‌కు గురైంది. సోమవారం జరిగిన మూడో టీ20లో ఆసీస్ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ ఆసీస్ బౌలర్ల ధాటికి 18.1 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. బాబర్ ఆజం (41) టాప్ స్కోరర్.

ఆరోన్ హర్డీ 3 వికెట్లు తీయగా.. జంపా, స్పెన్సర్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా 11.2  ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. మార్కస్ స్టోయినిస్ (27 బంతుల్లో 61 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు.

స్టోయినిస్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, స్పెన్సర్ జాన్సన్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ గెలుచుకున్నారు. ఈ ఏడాది జూన్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లోనూ పాకిస్థాన్ గ్రూప్ దశలోనే వెనుదిరిగింది.