19-11-2024 12:00:00 AM
టురిన్ (ఇటలీ): ఏటీపీ టూర్ ఫైనల్స్ విజేతగా ఇట లీ స్టార్, ప్రపంచ నంబర్‌వన్ జానిక్ సిన్నర్ నిలిచాడు. ఆదివారం అర్థరాత్రి జరిగిన ఫైనల్ పోరులో సిన్నర్ 6-4, 6-4తో అమెరికా స్టార్ టేలర్ ఫ్రిట్జ్‌పై సునాయాస విజయాన్ని అందుకున్నాడు. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోనూ టేలర్‌పైనే విజయం సాధించిన సిన్నర్ విజేతగా నిలిచాడు.
ఈ ఏడాదిని నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించిన సిన్నర్ ఇటీవలే ర్యాంకింగ్ ట్రోఫీని కూడా అందుకున్నా డు. గత మార్చిలో డోపింగ్‌లో పట్టుబడిన సిన్నర్ నిషేధిత డ్రగ్ తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే తాను డ్రగ్ తీసు కోలేదంటూ వాడా (వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ)కు వ్యతిరేకంగా కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్)లో అప్పీల్ చేశాడు.
వచ్చే ఏడాది జనవరిలో దీనికి సంబంధించిన తుది తీర్పు రానుంది. తనపై డోపింగ్ ఆరోపణలు వచ్చినప్పటికీ ఆటలో మాత్రం ఏకాగ్రతను కోల్పోని సిన్నర్ వరుస విజయాలతో అభిమానులను అలరిస్తున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో పాటు యూఎస్ ఓపెన్ నెగ్గిన సిన్నర్‌కు ఇదే తొలి ఏటీపీ టూర్ టైటిల్ కావడం విశేషం.
గతేడాది ఇదే ఏటీపీ టూర్ ఫైనల్లో జొకోవిచ్ చేతిలో ఓటమి పాలైన సిన్నర్ రన్నరప్‌గా నిలిచాడు. అంతేకాదు ఏటీపీ టూర్ గెలిచిన తొలి ఇటలీ ప్లేయర్‌గా జానిక్ సిన్నర్ రికార్డులకెక్కాడు. ఏటీపీ ఫైనల్స్‌లో సిన్నర్ ఈసారి ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ తన ప్రత్యర్థికి ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. ఇవాన్ లెండిల్ (1986 లో) తర్వాత ఈ ఘనత సాధించిన ప్లేయర్‌గా సిన్నర్ నిలిచాడు.
కేవలం టాప్-8 ప్లేయర్స్ మాత్రమే పోటీ పడే ఈ టోర్నీలో విజేతగా నిలిచిన సిన్నర్ 4.8 మిలియన్ డాల ర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 40 కోట్లు) ప్రైజ్‌మనీ దక్కింది. ఈ సీజన్‌లో సిన్నర్‌కు ఇది వరుసగా 11వ విజయం. ఈ ఏడాది ఏటీపీ సీజన్‌ను 8 టైటిల్స్‌తో ముగించిన సిన్నర్ రికార్డు 70-6గా ఉండడం విశేషం.