12-07-2025 01:46:42 AM
చేర్యాల, జులై 11: చేర్యాల సబ్ డివిజన్ వ్యాప్తంగా టిఆర్‌ఎస్ కార్యకర్తల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పల్లారాజేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. చేర్యాల పట్టణంలో భారీ కేకును కోసి ఒకరినొకరికి పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. కొమరవెల్లి మండల కేంద్రంలో కార్యకర్తలు కట్ చేశారు. అంతకుముందు కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అదేవిధంగా పోలీస్ బొమ్మ వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మద్దూరు, దూల్మిట్ట మండలాల్లో జన్మదిన వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు అంకు గారి శ్రీధర్ రెడ్డి, మంగోల్ చంటి, పబ్బోజు విజయేందర్, బొంగు రాజేందర్ రెడ్డి, ముత్యం నర్సింలు, గీస బిక్షపతి, ఎరుపుల మహేష్ తాజా మాజీ జెడ్పిటిసి సిల్వేరుసిద్ధప్ప, తలారి కిషన్, బుడిగే గురువయ్య గౌడ్, కొండ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.