13-05-2025 12:00:00 AM
భద్రాద్రి కొత్తగూడెం, మే 12(విజయ క్రాంతి) : బెజవాడలో మే 11,ఆదివారం నిర్వహించిన బెజవాడ ఓపెన్ టెన్నిస్ టోర్న మెంట్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ పాల్వంచ (ఏటీపీ) కు చెందిన క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఇరు రాష్ట్రాల జట్ల మధ్య జరిగిన పోటీలలో 60+ విభాగంలో అన్నం వెంకటేశ్వర్లు టీం విజేతలుగాను, 40+విభాగం లో భాస్కర్ రావు, కబీర్దాస్ లు, 30+విభాగంలో సతీష్, కృష్ణలు రన్నర్స్ గాను నిలిచారు.
ఈ సందర్భంగా బెజవాడ ఓపెన్ నిర్వాహకులు రాజేందర్ ప్రసాద్ ( ఐ ఆర్ టి ఎస్) మాట్లాడుతూ మొదటిసారి మా అ కాడమీ ద్వారా నిర్వహించిన పోటీలలో ఇరు రాష్ట్రాల నుండి టెన్నిస్ అభిమానులు పాల్గొనడం మాకు సంతోషంగా అనిపించింది. అ దేవిధంగా పాల్వంచ నుండి ఇంతటి గట్టి పో టీదారులు రావడం, మాకు ఆనందం కలిగించిందన్నారు.
ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ టెన్నిస్ క్రీడాకారులను తయారు చే సే బాధ్యత ఈ విజయం నాకు గుర్తుచేస్తుందన్నారు. అసోసియేషన్ నుండి జూనియ ర్స్ విభాగంలో సుమారు 15 నుండి 20 మంది క్రీడాకారులు ఉన్నారని వారిని కూ డా క్రీడా స్ఫూర్తితో ముందుకు తీసుకువెళ్తానని తెలిపారు.