calender_icon.png 13 July, 2025 | 7:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీకి చిక్కిన పంచాయితీ రాజ్ ఏఈ

12-07-2025 11:07:21 PM

రూ. 90 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత..

కాల్వశ్రీరాంపూర్ (విజయక్రాంతి): లంచగొండి అధికారి అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. శనివారం పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం వద్ద పంచాయతీరాజ్ ఏఈ జగదీష్(Panchayat Raj AE Jagadish) రూ.90 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. కాల్వశ్రీరాంపూర్ పంచాయతీరాజ్ ఏఈ జగదీష్ ఓదెల మండలం బాయమ్మపల్లి గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ రాజు నుండి సీసీ రోడ్డు బిల్లు మంజూరు కోసం రూ. 90 వేల రూపాయలు డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఎవరైనా లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు.