15-08-2025 12:40:18 AM
ఆదిలాబాద్, ఆగస్టు 14 (విజయక్రాంతి): స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానం ముస్తాబయింది. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగంతో పాటు పోలీసు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపట్టారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు, మాజీ మంత్రి మమ్మద్ షబ్బీర్ అలీ ఆదిలాబాద్‌కు చేరుకున్నారు.
స్థానిక పెన్ గంగా గెస్ట్ హౌస్ వద్ద ఆయనకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ లు పుష్పగుచ్చలను అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ ఎస్పీతో పాటు అధికారులతో ప్రభుత్వ సలహాదారుడు కాసేపు సమావేశమయ్యారు.