15-08-2025 12:39:26 AM
బ్రిడ్జి పైనుంచి పొంగిపొర్లుతున్న వరద నీరు
బాన్సువాడ ఆగస్టు 14 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా వర్ని మండలం పైడిమల్ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పైడిమల్ గ్రామం నుండి వర్ని మండల కేంద్రానికి ఇటు హనుమా జిపేట్ గ్రామానికి వెళ్లే బ్రిడ్జి పై నుండి వరద నీరు పొంగి పొల్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
గ్రామాలకు వెళ్లే ప్రజలు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. వరద ఉధృతి తగ్గితే గ్రామానికి వెళ్లే పరిస్థితి ఉంటుందని లేనియెడల రాకపోకలు ఉండవని ప్రజలు పేర్కొంటున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.