21-11-2025 12:53:53 AM
కొత్తపల్లి, నవంబరు 20 (విజయ క్రాంతి): కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించిన 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో వివిధ పోటీల్లో పారడైజ్ పాఠశాల విద్యార్థులు పాల్గొనిజిల్లా స్థాయిలో బహుమతులు సాధించినట్లు పాఠశాల చైర్మన్ డా. పి. ఫాతిమా రెడ్డి తెలిపారు.
డ్రాయింగ్ విభాగంలో యు.శివాణి ప్రథమ, మెమరీ విభాగంలో ఎ మహిత్ ప్రథమ, క్విజ్ విభాగంలో సాన్విత & టీం ప్రథమ, వ్యాసరచన పోటీలలో సనా రెండవ, మెహిందీ విభాగంలో యు శివాణి రెండవ బహుమతి సాధించినట్లు తెలిపారు. గురువారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ టి వసంత, వైస్ ప్రిన్సిపాల్ మధు, ఉపాధ్యాయులు, విద్యార్థులుపాల్గొన్నారు.