21-11-2025 12:52:35 AM
కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ రావు
కోరుట్ల నవంబర్ 20 (విజయక్రాంతి) కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో కుంటాల శకుంతల ప్రతాప్ లకు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వంలో మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తయిన సందర్భంగా గురువారం గృహ ప్రవేశ వేడుకలకు నిర్వహించారు ఇట్టి గృహ ప్రవేశ వేడుకలకు ముఖ్య అతిథిగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ రావు హాజరయ్యారు అనంతరం లబ్ధిదారులకు ఆడబిడ్డ కానుకగా నూతన వస్త్రాలను అందజేసిన జువ్వాడి నర్సింగ్ రావు అనంతరం ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల ప్రెసిడెంట్ పత్రాలు తీసుకున్నవారు.
ఇంటి నిర్మాణాలు త్వరగా చేపట్టుకోవాలని సూచించారు ఇంటి నిర్మాణాలు ఏ విధంగా జరిగితే ఆ విధంగా ఆ ఇంటి యజమాని ఖాతాలో డబ్బులు జమవుతాయన్నారు.
ఈ కార్యక్రమంలో జువ్వాడి నర్సింగరావు తోపాటు కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి యూత్ కాంగ్రెస్ కోరుట్ల నియోజకవర్గ మాజీ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు శశిధర్ రెడ్డి నాయకులు గంగాధర్ చింతకుంట సాయి రెడ్డి సంజీవరెడ్డి పుల్లారెడ్డి హన్మక్క పద్మ రాకేష్ రెడ్డి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు తదితరులుపాల్గొన్నారు.