20-05-2025 01:04:50 AM
టోల్ గేట్ నిర్వాహకులపై ఎమ్మెల్యే ఆగ్రహం
పెద్దపల్లి మే19 (విజయ క్రాంతి); ప్రయాణించే ప్రయాణికుల ప్రజల ప్రాణాలే నాకు ముఖ్యమని రామగుండం- పెద్ద పల్లి ప్రధాన రహదారిపై ఉన్న బసంత నగర్ లోని టోల్ గేట్ నిర్వాహకులపై సోమవారం ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
టోల్ గేట్ నిర్వాహకులు ప్రజల ప్రయోజనాలపై చూపుతున్న నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండించారు. గత 12 సంవత్సరాలుగా టోల్ వసూళ్ల ద్వారా లాభాలు పొందుతున్న సం స్థ, ప్రజల భద్రతకు అవసరమైన సర్వీస్ రోడ్లు, ఇతర సౌకర్యాల ఏర్పాటులో విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు.
లారీ డ్రైవర్లకు మినహాయింపులు ఇవ్వాలి
గోదావరిఖని నుండి లోడ్ తీసుకెళ్లి తిరిగివస్తున్న లారీలకు టోల్ మాఫీ కల్పించాలని ఎమ్మెల్యే తెలిపారు. స్థానికులను ఉద్యోగాల నుండి తొలగిస్తూ, బయట ప్రాంతాలవారిని నియమించడం పూర్తిగా అన్యాయమని ఎమ్మెల్యే గట్టిగా తెలిపారు.
సర్వీస్ రోడ్ల నిర్వహణ లోపాల పై స్పందించాండి
సర్వీస్ రోడ్ల నిర్వహణ లోపాల పై స్పందించాండని ఎమ్మె ల్యే సూచించారు. ప్రస్తుతం ఉన్న రహదారుల పరిస్థితి దయనీయంగా ఉందనీ, మెయింటెనెన్స్ లోపాల వల్ల అనేక ప్ర మాదాలు చోటుచేసుకుంటున్నాయని ఎమ్మెల్యే విమర్శించా రు. ప్రజల కోసం పోరాటం కొనసాగుతుందని, ఈ విషయంలో చర్యలు తీసుకునే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేద ని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.