calender_icon.png 20 May, 2025 | 4:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుందరయ్య ఆశయాలను సాధించాలి

20-05-2025 01:05:31 AM

సీపీఎం నాయకులు ఆలేటి ఎల్లయ్య, కీసరి నర్సిరెడ్డి 

ఎల్బీనగర్, మే 19 : పుచ్చలపల్లి సుందరయ్య ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీఎం నాయకులు ఆలేటి ఎల్లయ్య, కీసరి నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. పుచ్చలపల్లి సుందరయ్య గారి 40వ వర్ధంతిని ఎల్బీనగర్ సర్కిల్ కమిటీ ఆధ్వర్యంలో సాగర్ రింగ్ సాగర్ రింగ్ రోడ్ చౌరస్తాలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలేటి ఎల్లయ్య మాట్లాడుతూ..

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, జీవితాంతం పీడిత ప్రజల కోసం పోరాడిన ఆదర్శ నేత కామ్రేడ్ సుందరయ్య అని కొనియాడారు  ఈ కార్యక్రమంలో  సీపీఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యుడు చంద్రమోహన్, సీనియర్ నాయకులు పెత్తుల రవీందర్, ఎల్బీనగర్ సర్కిల్ కమిటీ సభ్యులు  పొట్టే పాకు రామస్వామి,  బి.దుర్గారావు, మంతాని యాదయ్య, గడ్డం రవీందర్, బి.కాశయ్య, సభ్యులు లక్ష్మయ్య రాధమ్మ.

గంగమ్మ, ఎల్లమ్మ, పోలేని చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.  నాగోల్ లో జరిగిన కార్యక్రమంలో సీపీఎం నాయకుడు చెన్నారం మల్లేశం, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమోహన్, జిల్లా ఉపాధ్యక్షులు కీసరి నర్సిరెడ్డి, నాయకులు ఆలేటి ఎల్లయ్య, చింతపల్లి కృష్ణయ్య, ఆరుట్ల మల్లేశం, చైతన్య తదితరులు పాల్గొన్నారు.

  1. కులవ్యక్షతపై పోరాటాన్ని  ప్రారంభించిన నేత సుందరయ్య 
  2. సిపిఎం రాష్ర్ట కార్యదర్శి జాన్ వెస్లీ 

శేరిలింగంపల్లి, మే 19: కులవ్యక్షకు వ్యతిరేకంగా తన ఇంటి నుండే పోరాటాన్ని ప్రారంభించిన మహానేత పుచ్చలపల్లి సుందరయ్య అని సిపిఎం రాష్ర్ట కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. గచ్చిబౌలి సుందరయ్య కేంద్రం ఆధ్వర్యంలో  సుందరయ్య 40వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ చరిత్రలోనే సుందరయ్య కి ప్రత్యేక స్థానం ఉంటుందని ఆయన అన్నారు.

చదువుకుంటున్న రోజుల్లోనే పేదల పక్షాన పోరాటం చేస్తూ కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితులైన ఆయన మొదటగా తన ఇంట్లో పనిచేస్తున్న పాలేరుల విషయంలో తల్లిదండ్రులు వ్యవహరిస్తున్న తీరుపై తన పోరాటాన్ని కొనసాగించారని తెలిపారు. కులం రక్షకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న పోరాటాలు ముందుండి పోరాడిన వ్యక్తి సుందరయ్య అని తెలిపారు.

వ్యవసాయ కార్మిక సంఘం స్థాపించడం ద్వారా వ్యవసాయంలో కూలీలుగా పనిచేస్తున్న ప్రజలు మిట్టి చాకిరికి నూరాయి కనీస వేతనాలు రాని రోజుల్లో వ్యవసాయ కార్మిక సంఘం ద్వారా కనీస వేతనాల కోసం భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం నిర్వహించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం శేరిలింగంపల్లి నాయకులు శోభన్, కే.కృష్ణ,సుందరయ్య విజ్ఞాన కేంద్రం సిబ్బంది సాంబశివరావు, అనిల్,రవి విజయ్,తదితరులు  పాల్గొన్నారు.

‘ఆదర్శ నేత సుందరయ్య’

తుర్కయంజాల్, మే 19 ః ఆదర్శ నేత, అవిశ్రాంత పోరాట యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్థంతిని తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు డి.కిషన్ ఆధ్వర్యంలో తుర్కయంజాల్ లో, మన్నెగూడ ఎన్ ఎస్ ఆర్ కాలనీలో మున్సిపల్ నాయకులు ఆశీర్వాదం ఆధ్వర్యంలో సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కిషన్, ఆశీర్వాదం మాట్లాడుతూ స్వాతం త్య్ర పోరాటంలో జైలు జీవితం గడిపిన త్యాగశీలి సుందరయ్య అని కొనియాడారు.

దోపిడీకి వ్యతిరేకంగా ప్రజల్ని కూడగట్టి అనేక ప్రజా ఉద్యమాలు నిర్మించారన్నారు. చట్టసభల్లో, ఇటు బయట ప్రజల పక్షాన పోరాడిన నికార్సున కమ్యూనిస్టు నేత అని కొనియాడారు. నేటి యువత సుందరయ్య ఆశయాలు, లక్ష్యాల స్ఫూర్తితో ముందుకెళ్లాలని అన్నారు.

సీపీఎం తుర్కయంజాల్ మున్సిపల్ కమిటీ సభ్యులు కె.అరుణ్ కుమార్, నాయకులు బి.శంకరయ్య, మాధవరెడ్డి, అంజయ్య కుమార్, యాకయ్య, నాంపల్లి శంకర్, పరమేష్, శేఖర్ రెడ్డి, నరసింహ, కొండిగారి శంకర్, నిమ్మ లక్ష్మయ్య, కొత్తపల్లి యాదయ్య, యాదగిరి, శీను, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.