calender_icon.png 23 October, 2025 | 4:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల సమస్యలపై జర నజరేయండి

23-10-2025 01:56:32 AM

మంగపేట, అక్టోబర్ 22,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ప్రజలు ప్రస్తుతం ఒక పెద్ద సమస్యతో సతమతం అవుతున్నారు. స్థానిక ఇసుక క్వారీ నిర్వాహకులు ఇసుక లోడింగ్ కోసం వచ్చిన తమ లారీలు రోడ్లపై ఇరువైపులా నిలిపి ఉంచడంతో ప్రజలు రోడ్లపై ప్రయాణించాలంటే ప్రాణం అరచేతిలో పెట్టుకోవాల్సన దుస్థితి నెలకొంది. ఇసుక లారీల వల్ల రోడ్లు పూర్తిగా గుంతల మయంగా మారిపోవడంతో రాకపోకల సమస్య ఒక్కటే కాదు రోడ్డు ప్రమాదాలకు నెలవుగా మా రింది.

ఈ పరిస్థితి కేవలం రోడ్డు సమస్యలతోనే పరిమితమై లేదు, పైగా దీనితో జనప్రాణాల కు ఒక సవాలుగా మారింది. ప్రజలు పడుతున్న బాధలను పట్టించుకునే నాథుడు కరువయ్యా డు. అధికారులు మాత్రం ప్రజా సమస్యలు పక్కనపెట్టి స్వకార్యంపై దృష్టి పెడుతున్నారని ప్రజలలో అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ఇకనైనా ఈ సమస్యపై స్థానిక అధికారులు, ప్రజా ప్రతి నిధులు ప్రత్యేక నజరేసి ఇసుక క్వారీ కాంట్రాక్టర్లు ఎలాంటి నిబంధనలు పాటించాలి అనే అంశా న్ని ఇసుక క్వారీ నిర్వాహకులకు తెలియచేసి నిరంతరం ప్రజాసమస్యలను గుర్తిస్తూ వాటి పరిష్కార దిశగా అధికారులు నడవాలని ప్రజలు కోరుకుంటున్నారు.