calender_icon.png 27 September, 2025 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దసరాకైనా వేతనాలు చెల్లించండి

27-09-2025 02:02:44 AM

అదిలాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): దసరా పండగ రోజున తమ కుటుం బాలను పస్తున ఉంచవద్దని గ్రామ పంచాయతీ కార్మికులు ప్రభుత్వాన్ని విన్నవించారు. 3 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కార్మికులు నిరసన తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్ శ్యామల దేవికి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బొజ్జు ఆశన్న మాట్లాడుతూ... మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేసి, జీవో నెంబర్ 51 ని సవరించాలన్నారు. రాష్ర్టంలో అతి ముఖ్యమైన పండుగ రోజున గ్రామ పంచాయతీ కార్మికులను పస్తులుంచకుండా పెండింగ్ బకాయి తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.

రాష్ర్ట ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం పంచాయతీ కార్మికులకు వేతనాలు గ్రీన్ ఛానల్ ద్వారా కార్మికుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేయాలని, మల్టీపర్పస్ వర్కర్స్ పని విధానం వలన ప్రమాదాలు జరిగి మరణిస్తున్న కార్మికులకు  రూ. 20 లక్షల నష్టపరిహారం ప్రకటిం చాలని, జీవో నెంబర్ 51 ని సవరించి మల్టీ పర్పస్ వర్కర్స్ విధానం రద్దు చేయాలన్నారు.