27-09-2025 02:04:11 AM
నిర్మల్‌లో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే
నిర్మల్ సెప్టెంబర్ 26( విజయ క్రాంతి): రాష్ర్టంలో ప్రజల మద్దతు అధికారులకు వచ్చిన ప్రజా పాలన ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ప్రజలకు అమలు చేసే వరకు బిజెపి పోరాటం చేస్తుందని బిజెపి నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నిర్మల్ నియోజకవర్గం లోని సారంగాపూర్ లక్ష్మణ్ చందా మామిడి నిర్మల్ టౌన్ నేత్ర మండలాల్లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు.
సారంగాపూర్ లో 30 లక్షలతో ఎత్తిపోతల పునరుద్ధరణ పనులు, మాముడాలు 50 లక్షలతో ఆలయాల అభివృద్ధి 20 లక్షలతో పట్టణంలో చిలుకమ్మ ఆలయం అభివృద్ధి పనులను ప్రారంభించారు. నిర్మల్ నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా లేకుండా కురిచేస్తున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.