calender_icon.png 21 May, 2025 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మినీ అంగన్వాడీలకు జీతాలివ్వండి

21-05-2025 12:20:39 AM

-ముఖ్యమంత్రికి హరీశ్‌రావు బహిరంగ లేఖ

హైదరాబాద్, మే 20 (విజయక్రాంతి): రాష్ట్రంలోని మినీ అంగన్వాడీలు 3,989 మందికి ఏడాదిగా పెండింగ్‌లో ఉన్న జీతాలను పూర్తి స్థాయిలో చెల్లించాలని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.

2024 జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలలు అంగన్వాడీ పే గ్రేడ్‌లో రూ.13,650 జీతం చెల్లించిన ప్రభుత్వం ఆ తర్వాత మినీ అంగన్వాడీ జీతం రూ.7800కి తగ్గించి, 2025 ఏప్రిల్ నుంచి అదే జీతం చెల్లించిందన్నారు. మే నెలలో కేవలం ఎన్నిమిది జిల్లాల్లోని మినీ అంగన్వాడీలకు అప్‌గ్రేడ్ జీతాలిచ్చి, మిగతా జిల్లాల వారికి ఇవ్వలేదన్నారు. మే నెల పెరిగిన జీతాలు అందని జిల్లాల్లో జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.