calender_icon.png 28 September, 2025 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరబిందో ఫార్మాలో పీసీబీ అధికారులు

28-09-2025 12:25:21 AM

-తనిఖీ చేసి, శాంపుల్స్ సేకరణ

-నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడి

-ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి హెచ్చరికకు స్పందించిన అధికారులు

-కంపెనీ నుంచి బయటికి ఉన్న పైప్‌లైన్‌లను మూసివేయించిన వైనం

జడ్చర్ల, సెప్టెంబర్ 27: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండల పరిధిలోని పోలే పల్లిలోని అరబిందో ఫార్మాను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు శనివారం తని ఖీ చేశారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి శుక్రవారం అరబిందో కంపెనీని పొల్యూష న్ బోర్డు అధికారులు తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆదివారం ఉదయం 11 గంటలకు కంపెనీని తగలబెడతానని వీడియోను విడుదల చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశం చర్చినీయాంశం గా మారింది.

స్పందించిన అధికారులు శనివారం ఉదయం అరబిందో ఫార్మాలో తనిఖీలు చేపట్టారు. కంపెనీ నుంచి బయటి ప్రాంతాలకు ఉన్న పైప్‌లైన్‌లను మూసివేయాలని కంపెనీ నిర్వాహకులకు ఆదేశించా రు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. అరబిందో ఫార్మా నుంచి పైప్ లైన్‌ల ద్వారా పంట పొలాలకు, చెరువులకు విడుదల చేస్తున్నారని ఆరోపణలున్న నీటి శాంపిల్స్ సేకరించామని చెప్పారు. ల్యాబ్‌లలో  పరిశీలించి, వచ్చిన నివేదిక ఆధారం గా ఉన్నత అధికారులతో చర్చించి చర్యలు తీసుకుటుంటామని స్పష్టం చేశారు. తనిఖీలు నిర్వహించిన పీసీబీ అధికారుల్లో జాయింట్ చీఫ్ ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్, పీసీబీ ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్, పీసీబీ ఏఇ, జీఎం ఇండస్ట్రీస్ ఉన్నారు.

తగులబెట్టాలనే నిర్ణయం తాత్కాలికంగా వాయిదా: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

అరబిందో ఫార్మా కంపెనీలో కలుషిత జలాల విషయంగా తనిఖీలు చేసిన కాలు ష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారు లు ఇచ్చే నివేదిక కోసం ఎదురు చూస్తానని, వారి నివేదిక చూసిన తర్వాత అరబిందో వ్యవహారంపై ఏం చేయాలో నిర్ణయిస్తానని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. అధికారుల తనిఖీల నేపథ్యంలో శుక్రవారం అరబిందోను తగుల బెట్టాలని తాను తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నానని చెప్పారు.

గతంలో కూడా ఇలాంటి తనిఖీ లు జరిగాయని వాటివల్ల ఒరిగిందేమీ లేద ని, ఇప్పుడు కూడా అధికారులు ఇచ్చే నివేదికలో వాస్తవాలు లేకపోతే తాను అన్నంత పని చేస్తానని ప్రకటనలో హెచ్చరించారు. అరబిందో నుంచి కలుషిత జలాలను ముద్దిరెడ్డిపల్లి చెరువులోకి మల్లిస్తున్న మాట వాస్తవమని, దీని వల్ల రైతులు నష్టపోతున్నది కూడా నిజమేనని, అయితే ఈ వాస్తవా లు పీసీబీ అధికారుల నివేదికలో కన బడకపోతే తాను అన్నంత పని చేస్తాన ని మరోసారి హెచ్చరించారు. పీసీబీ అధికారులు ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుం డా నిజాయితీగా తమ నివేదికను ఇవ్వాలని అనిరుధ్‌రెడ్డి కోరారు.