calender_icon.png 23 August, 2025 | 2:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య

23-08-2025 12:16:16 AM

చేగుంట, ఆగస్టు  22 : ఇంటి నిర్మాణం కోసం తెచ్చిన అప్పు కట్టలేక  ఆత్మహత్య చేసుకున్న సంఘటన మాసాయిపేట మండలం పోతన్ పల్లి గ్రామంలో చోటుచేసుకుంది.  పోతనపల్లి గ్రామానికి చెందిన తిరుపతి ఆంజనేయులు(49) తన ఇంటి నిర్మాణం కోసం అప్పులు చేశాడు. అప్పులు ఎలా తీర్చాలో తరచు బాధపడుతూ ఉండేవాడని కుటుంబీకులు తెలిపారు.

కాగా తీవ్ర మనస్థాపానికి గురైన అతను గురువారం తన వ్యవసాయ పొలం వద్దకు వెళుతున్నానని ఇంట్లో చెప్పి, రాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోయేసరికి చుట్టుపక్కల బంధువుల వద్ద వెతుకుతుం డగా శుక్రవారం వ్యవసాయ పొలము పక్కన గల అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయి ఉన్నట్లు తెలిపారు. మృతుని పెద్ద కుమారుడైన తిరుపతి శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు