calender_icon.png 26 December, 2025 | 3:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వేషన్లు ఎగ్గొట్టడానికే అసెంబ్లీలో ఎన్నికల అంశం

26-12-2025 01:28:55 AM

27న హోటల్ అభినందన్ గ్రాండ్స్‌లో బీసీల అఖిలపక్ష సమావేశం

తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ

ముషీరాబాద్, డిసెంబర్ 25 (విజయక్రాంతి): కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేశాకే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా బీసీల 42 % రిజర్వేషన్ల హామీని ఎగరగొట్టడానికే ఈ వారంలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల అంశాన్ని ఎజెండాలో ఏర్పరిచాయని ఆయన ఆరోపించారు.

దానిని ప్రతిఘటించడానికే ఈనెల 27న హోటల్ అభినందన్ గ్రాండ్స్ అన్ని పక్షాల, సంఘాలలోని నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఈ మేరకు గురువారం హైదరగూడలోని ఎన్‌ఎస్‌ఎస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎర్ర సత్యనారాయణ మాట్లాడుతూ బీసీలకు స్థానిక సంస్థలైన సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి, కౌన్సిలర్, కార్పొరేటర్, చైర్మన్, మేయర్, సహకార డైరెక్టర్లు, చైర్మన్లు, విద్య, ఉద్యోగ, కాంట్రాక్టు తదితరాన్ని రంగాలలో 42 శాతం రిజర్వేషన్లు అనేది కాంగ్రెస్ హామీ అని, కేవలం సర్పంచ్ చర్చతోనే హైకోర్టు తీర్పు పేరా ముగించేది దుష్ట యత్నమని ఆయన మండిపడ్డారు.

మిగతా ఏ స్థానిక ఎన్నికలకు కోర్టు అడ్డులేదని ఇచ్చిన సర్పంచ్ అంశంలోని స్టేట్ కూడా తుది తీర్పు లోబడే ఉంటుందని ఆయన తెలిపారు. 27న జరిగే అత్యవసర సమావేశానికి మాజీ గవర్నర్ బండారి దత్తాత్రే య, ఎంపీలు ఈటల రాజేందర్, ఆర్. కృష్ణయ్య, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రులు గంగుల కమలా కర్, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ వి. హనుమంత రావు, డాక్టర్ పి. వినయ్, జాజుల శ్రీనివాస్ గౌడ్, విజిఆర్ నారగోని, జస్టిస్ చంద్రకుమార్, జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్, రిటైర్డ్ (ఐఏఎస్) టీ. చిరంజీవులు, జగన్మోహన్, బాలరాజ్ గౌడ్ నాతోపాటు రాజకీ య నాయకులు హాజరవుతున్నారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో హిందూ బిసి మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు పర్వత సతీష్ కుమార్, బీసీ సంఘం ప్రతినిధులు కోల జనార్దన్ గౌడ్, నాగుల శ్రీనివాస్ యాదవ్, రవి మహారాజ్, అరుణ్ కుమార్, శేరిపల్లి నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.