02-11-2025 10:34:57 PM
బెజ్జూర్ (విజయక్రాంతి): ఆధ్యాత్మికతలోనే ప్రశాంతత ఉందని కౌటాల మండల వ్యవసాయ అధికారి ప్రేమలత అన్నారు. ఆదివారం బెజ్జూర్ మండలం ముంజంపల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో కార్తీకమాసం సందర్భంగా సప్తమ మహోత్సవంలో భాగంగా 4వ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులతో రైతులు సుభిక్షంగా ఉండాలని పంటలు సమృద్ధిగా పండాలని అకాల వర్షాలు శాంతించాలని వేడుకున్నట్లు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నవితరణ చేశారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యులు ఏవో దంపతులను ఘనంగా సన్మానించారు.