23-08-2025 12:09:50 AM
నారాయణఖేడ్, ఆగస్టు 22: గ్రామపంచాయతీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఆందోళన కార్యక్రమానికి బిజెపి పార్టీ పిలుపునివ్వగా ఇందులో భాగంగా నారాయణఖేడ్ బిజెపి నాయకులను పోలీసులు శుక్రవారం ముందస్తు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా బిజెపి నాయకులు రజినీకాంత్, దశరథ్, పట్నం మాణిక్ లు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేస్తుందని, పంచాయతీలలో అభివృద్ధి పడక వేసిందని ఆరోపించారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లను, మురుగు కాలువలను, కల్వర్టులకు మరమ్మత్తులు వెంటనే చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలుపాల్గొన్నారు.
కొండాపూర్‌లో..
కొండాపూర్ : కొండాపూర్ బీజేపీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. మండల పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు అమ్రాది యెల్లయ్యతో సహా పలువురు ముఖ్య నేతలను తెల్లవారుజామునే అదుపులోకి తీసుకున్నారు. ఈ అక్రమ అరెస్టులను బీజేపీ తీవ్రంగా ఖండించింది.