17-10-2025 06:10:41 PM
డివైఎస్ఓ అక్కపాక సురేష్
పెద్దపల్లి జిల్లా టేబుల్ టెన్నిస్ క్రీడా పోటీలు ప్రారంభం
సుల్తానాబాద్,(విజయక్రాంతి): విద్యార్థులు లక్ష్యం నిర్దేశించుకొని పట్టుదలతో ముందుకు సాగాలని పెద్దపల్లి జిల్లా డివైస్ ఓ అక్కపాక సురేష్, కేజీఎఫ్ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, ఎంఈఓ రాజయ్య అన్నారు. సుల్తానాబాద్ పట్టణంలోని స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో శుక్రవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా టేబుల్ టెన్నిస్ పోటీలను ప్రారంభించారు. జిల్లాలోని వివిధ పాఠశాల నుంచి 100 మంది విద్యార్ధిని విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతొ పాటు క్రీడల్లో రాణించాలని,లక్ష్యం దిశగా ముందుకు సాగాలని, గెలుపోటములు సమానంగా తీసుకోవాలని, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు.ఈ సందర్భంగా జిల్లా స్థాయి పోటీల్లో గెలుపొంది కరీంనగర్ ఉమ్మడి జిల్లా స్థాయికి ఎంపికైన క్రీడాకారులకు మెడల్స్ ప్రదానం చేశారు.