27-09-2025 01:08:36 AM
పెద్దపల్లి, సెప్టెంబర్26(విజయక్రాంతి) తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన పండుగలైన సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం పెద్దపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని పలు మండలాల ఎంపీడీఓ లు, ఎంపీవో లతో కలిసి సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఎ మ్మెల్యే విజయరమణ రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూసోమవారం సద్దుల బతుకమ్మ పండగ సందర్బంగా నియోజకవర్గంలో పండగ ఘ నంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేయాలనీ అధికారులను ఆదేశించారు. అలాగే త్రాగు నీ రు, విద్యుత్, పారిశుద్యం, భద్రత వంటి సౌకర్యాలు అధికారులందరూ సమన్వయంతో కల్పించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎంపీడీఓలు, తదితరులు పాల్గొన్నారు.