calender_icon.png 4 August, 2025 | 6:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాన్సర్ రోగులకు పింఛను

26-06-2024 12:05:00 AM

రాష్ట్రంలో కొత్తగా ఇచ్చే ‘చేయూత’ పథకంలో భాగంగా క్యాన్సర్ రోగులకు రూ. 6,000 పింఛన్ ఇవ్వాలి. దురదృష్టవశాత్తు ఈ మహమ్మారి బారిన పడిన రోగుల కుటుంబాలు ఆర్థికంగా బాగా చితికిపోతున్నాయి. వైద్య ఖర్చులకు, నెలవారీ మందుల కోసం సర్కారు ఇచ్చే పింఛన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. చావు రోజులను లెక్కిస్తూ జీవిస్తున్న రోగులను ప్రభుత్వం ఈ రకంగా ఆదుకోవాలి. దీనివల్ల బాధితులకు మనోధైర్యాన్ని ఇచ్చినట్టవుతుంది. నాణ్యమైన పౌష్టిక ఆహరం తీసుకోవడానికీ ఆ సొమ్మును ఉపయోగించుకోగలరు. తద్వార వారి జీవిత కాలాన్ని కొంతమేర పెంచిన వారమవుతాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం.

 -గుండమల్ల సతీష్ కుమార్