23-09-2025 07:10:32 PM
మేడిపల్లి (విజయక్రాంతి): భార్యా, భర్తల మధ్య గొడవతో భర్త అదృశ్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్(Medipally Police Station) పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొండ్రాయి గ్రామం, కొడకండ్ల మండలం, జనగామ జిల్లాకు చెందిన ధరావత్ రాజేష్(26), భార్య ధరావత్ శిరీష, బోడుప్పల్ శ్రీ లక్ష్మీ నగర్ కాలనీలో ఉంటున్నారు. వీరికి 2022 జనవరిలో వివాహం అయ్యింది. రాజేష్ సరూర్ నగర్ లో అమూల్య సిల్క్ షాపింగ్ మాల్ లో పనిచేస్తున్నాడు. శిరీష బోడుప్పల్ లోని షాపింగ్ మాల్ లో పనిచేస్తుంది. పెళ్లి అయ్యి ఎన్ని నెలలు అయినా సంతానం కలగడం లేదని భార్యా, భర్తలు తరచూ గొడవలు పడుతుండేవారు. ఈనెల 20వ తేదీన శిరీష డ్యూటీకి వెళ్లగా ఆమె భర్త ఎవరికి చెప్పకుండా ఇంటి నుండి వెళ్లిపోయి తిరిగి రాలేదు. భార్య మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని మేడిపల్లి సీఐ గోవిందరెడ్డి తెలిపారు.