23-09-2025 11:32:37 PM
నాగారం: తెలంగాణ ఆర్ఎంపీ పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ మండల కమిటీని మంగళవారం తెలంగాణ ఆర్ఎంపీ పీఎంపీ వెల్పర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పి. లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నాగారం మండల అధ్యక్షులుగా తిగుళ్ల ప్రశాంత్ ప్రధాన కార్యదర్శిగా తంగేళ్ల వెంకన్న ఉపాధ్యక్షులుగా జి.వెంకన్న ఎం.రాజు కోశాధికారిగా జి వెంకటేశ్వర్లు గౌరవ అధ్యక్షులుగా బి.యాదగిరి గౌరవ సలహాదారులుగా కే.సోమయ్య సహాయ కార్యదర్శిగా ఎం.మహేష్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా డీ.లక్ష్మణ్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ... ఆర్ఎంపీలు ప్రధమ చికిత్స మాత్రమే చేయాలని సూచించారు. గత ప్రభుత్వం ఆర్ఎంపీలను గుర్తించిన విషయం టీఎంసీ అధికారులు గుర్తించకపోవడం బాధాకరమైన విషయం అని అన్నారు.