10-12-2025 02:04:44 AM
ముంబై, డిసెంబర్ 9 : ఐపీఎల్ మినీ వేలానికి సమయం దగ్గర పడుతోంది. ఈ నెల 16 న అబుదాబీ వేదికగా ఆటగాళ్ల వేలం జరగబోతోంది. తాజాగా ఈ వేలానికి సంబంధించి తుది జాబితాను బీసీసీఐ విడుదల చేసింది. వేలంలో పాల్గొనేందుకు మొదట 1355 మంది ప్లేయర్స్ రిజిస్టర్ చేసుకోగా.. ఫ్రాంచైజీలతో సుధీర్ఘ చర్చల తర్వాత బీసీసీఐ తుది జాబితాను 350 మందికి పరిమితం చేసింది. దాదాపు 1000 మంది ఆటగాళ్లను షార్ట్ లిస్ట్ నుంచి తొలగించారు. అయితే కొన్ని ఊహించని పేర్లు కూడా చేరాయి. 35 మంది కొత్త పేర్లు జాబితాలో చేర్చారు.
ఆశ్చర్యకరంగా సౌతాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికా క్ వేలంలోకి ఎంట్రీ ఇచ్చాడు. గత ఐపీఎల్ సీజన్‌లో మెరుగ్గా రాణించకపోవడంతో కోల్‌కత్తా నైట్ రైడర్స్ అతన్ని రిలీజ్ చేసింది. ఇటీవ లే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిం చి మళ్లీ వెనక్కి తీసుకున్న డికాక్ భారత్‌తో జరిగిన మూడో వన్డేలో సెంచరీ బాదాడు. ఫ్రాంచైజీల రిక్వెస్ట్‌తో అతన్ని షార్ట్ లిస్ట్‌లో చేర్చారు. ఈ సారి వేలంలో డికాక్ కోటి బేస్ ప్రైస్‌తో నిలిచినట్టు తెలుస్తోంది.
క్యాప్డ్ ప్లేయ ర్స్ రౌండ్‌లో బ్యాటర్లు, ఆల్‌రౌండర్లు, వికెట్ కీపర్లు, ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు క్రమంలో వేలం జరుగుతుంది. తర్వాత అన్‌క్యాప్డ్ కేటగిరీలోనూ ఇదే క్రమంలో ప్లేయర్స్ ఆక్షన్ ఉంటుంది. కాగా 350 మంది జాబితాలో 240 మంది భారత ఆటగాళ్లు, 110 మంది విదేశీ ప్లేయర్స్ చోటు దక్కించుకున్నారు. అన్‌క్యాప్డ్ విభాగంలో భారత్ నుంచి 224 మంది, విదేశాల నుంచి 14 మంది ఉన్నారు.
ఈ మెగా ఆక్షన్‌లో మొత్తం 77 స్లాట్స్ అందుబాటులో ఉంటాయి. వాటిలో 31 మం ది విదేశీ ప్లేయర్స్‌కు అవకాశముంది. షార్ట్ లిస్ట్‌లో రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో 40 మంది , రూ.1.5 కోట్ల బేస్ ప్రైస్‌తో 9 మంది, రూ.1.25 కోట్ల బేస్ ప్రైస్‌తో నలుగురు, కోటి రూపాయల బేస్ ప్రైస్‌తో 17 మంది, రూ.75 లక్షల బేస్ ప్రైస్‌తో నలుగురు, రూ.40 లక్షల బేస్‌ప్రైస్‌తో ఏడుగురు, రూ.30 లక్షల కనీస ధరతో 227 మంది వేలం బరిలో నిలిచారు. ఈ మినీ వేలంలో మొత్తం 10 ఫ్రాంచైజీల దగ్గర రూ. 237.55 కోట్లు ఉన్నాయి.