calender_icon.png 31 January, 2026 | 8:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెరిగే ధరలతో ప్రజలు విలవిల

24-10-2024 12:00:00 AM

ఇవాళ నిత్యావసరాలలో అన్ని వస్తువుల ధరలూ పెద్ద ఎత్తున పెరిగి పోతున్నాయి. అన్నింటిపైనా పన్నుల భారాన్ని ప్రభుత్వాలు పెంచుతూనే ఉన్నాయి. ఫలితంగా సామాన్యుల జీవితాలు రోజురోజుకూ దుర్భరమవుతున్నాయి. వారి గురించి ప్రభుత్వాలే కదా ఆలోచించి, తగు చర్యలు తీసుకోవాల్సింది? మధ్యతరగతి, పేదవారి వేతనాలు మాత్రం ఈ లెక్కన పెరగవు. సామాజిక సేవా కార్యకర్తలు, మేధావులైనా దీనిని సీరియస్‌గా ఆలోచించాలి. సామాన్యుడు జీవించే పరిస్థితులు రావాలి.


 సింగు లక్ష్మీనారాయణ, చింతకుంట